శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నంలో ఉన్న పాటూరి సీడ్‌ప్లాంట్ ఎదుట శనివారం జనగామ జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం గబ్బెట, ఇప్పగూడెం, బొమ్మెర గ్రామాలకు చెందిన రైతులు పాటూరి కంపెనీకి చెందిన సీడ్‌వరి సాగు చేశారు. సీడ్ ఫెయిల్ కావడంతో కంపెనీ యాజమాన్యాన్ని నిలదీశారు. ఎకరానికి రూ.70వేల పరిహారం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. పండిన ధాన్యం తీసుకుని, పరిహారం ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని రైతులు సీడ్‌ప్లాంట్ ఎదుట ఆందోళన చేశారు. అనంతరం కేశవపట్నం పోలీసులను ఆశ్రయించారు.


