లారీ ఇంజిన్‌లో మంటలు | - | Sakshi
Sakshi News home page

లారీ ఇంజిన్‌లో మంటలు

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

కరీంనగర్‌క్రైం: ఆదర్శనగర్‌ బోర్డు సమీపంలో లారీలో మంటలు చెలరేగాయి. కొత్తపల్లి మండలం బావుపేట నుంచి గ్రానైట్‌ రాయిని కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌కు లారీలో తరలిస్తున్నారు. గురువారం వేకువజామున ఆదర్శనగర్‌ వైన్స్‌ సమీపంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ లారీని రోడ్డుపక్కన నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే లారీ క్యాబిన్‌తో పాటు టైర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంజిన్‌లో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు ఫైర్‌ ఆఫీసర్‌ కె.నరేశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement