పోలీసుల ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల ప్రత్యేక పూజలు

Oct 23 2026 12:03 AM | Updated on Oct 23 2026 12:03 AM

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

కరీంనగర్‌క్రైం: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం కరీంనగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సీపీ గౌస్‌ ఆలం, పోలీసులు ప్రత్యేక పూజలు చేశా రు. అమరవీరుల ఆత్మశాంతి, వారి కుటుంబాల సంక్షేమం, పోలీస్‌ సిబ్బంది క్షేమం కోసం స్వామివారిని ప్రార్థించారు. ఏసీపీలు యాదగిరిస్వామి, వెంకటస్వామి, విజయకుమార్‌, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.

కుష్ఠు గుర్తింపు ప్రచారం ప్రారంభం

కరీంనగర్‌: కుష్ఠువ్యాధి గుర్తింపు ప్రచార కార్యక్రమాన్ని గురువారం మోతాజ్‌ఖానా పట్టణ ఆరోగ్యకేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజగోపాల్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో కుష్ఠువ్యాధిపై అవగాహన కల్పించడం, లక్షణాలను తొలిదశలో గుర్తించడం, అనుమానితులను గుర్తించి తగిన వైద్యం అందించడం కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ ప్రచార కార్యక్రమం అక్టోబరు 22 నుంచి నవంబర్‌ 4వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. వైద్యాధికారి ఇమ్రాన్‌ఖాన్‌ పాల్గొన్నారు.

హుజూరాబాద్‌ రూరల్‌: దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం ‘భూభారతి’ డిజిటల్‌ రీసర్వే చేపట్టిందని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ జిల్లా ఏడీ కిషన్‌రావు తెలిపారు. హుజూరాబాద్‌ మండలం కాట్రపల్లిలో గురువారం సర్పంచ్‌ పెరుమాండ్ల హైమావతి అధ్యక్షతన రీసర్వేపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో తొలివిడత కింద 70 గ్రామాలను ఎంపిక చేయగా.. కాట్రపల్లి పరిధిలోని 1,283 ఎకరాల్లో సర్వే జరగనుందన్నారు. సర్వే పూర్తయ్యాక రైతులకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ‘భూధార్‌ కార్డు’, ల్యాండ్‌ పార్సెల్‌ మ్యాప్‌ జారీ చేస్తామన్నారు. కొలతల్లో తేడాలుంటే అభ్యంతరాలు తెలిపేందుకు 60 రోజుల గడువు ఉంటుందన్నారు. తహసీల్దార్‌ జక్కని నరేందర్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే వెంకటరత్నం, సర్వేయర్‌ వంశీ, ఆర్‌ఐ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.9,250

జమ్మికుంట: స్థానిక వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్‌ పత్తి ధర గరిష్టంగా రూ.9,250 పలికింది. గురువారం మార్కెట్‌కు 40 వాహనాల్లో 230 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్‌ ధర రూ.9వేలు, కనిష్ట ధర రూ.8,800కు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్‌–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement