‘స్కాడా’తో విద్యుత్‌ అంతరాయాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

‘స్కాడా’తో విద్యుత్‌ అంతరాయాలకు చెక్‌

Oct 23 2026 12:03 AM | Updated on Oct 23 2026 12:03 AM

‘స్కాడా’తో విద్యుత్‌ అంతరాయాలకు చెక్‌

కరీంనగర్‌ సర్కిల్‌లో 97 సబ్‌స్టేషన్లకు అనుసంధానం

సాంకేతిక పరిజ్ఞానంతో టీజీఎన్పీడీసీఎల్‌ ముందడుగు

రియల్‌టైమ్‌ ఫీడర్‌ మానిటరింగ్‌తో విద్యుత్‌ సేవలు విస్తృతం

సాంకేతికతకు ప్రాధాన్యం

కొత్తపల్లి(కరీంనగర్‌): విద్యుత్‌ అంతరాయాలను తగ్గించేందుకు టీజీఎన్‌పీడీసీఎల్‌ మరో ముందడుగు వేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యతనిస్తూ రియల్‌టైమ్‌ ఫీడర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఆర్టీఎఫ్‌ఎంఎస్‌)ను విస్తృతస్థాయిలో అమలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కరీంనగర్‌ సర్కిల్‌ పరిధిలోని 97 సబ్‌స్టేషన్లను ‘స్కాడా’ (పర్యవేక్షణక నియంత్రణ) వ్యవస్థకు అనుసంధానించారు. ఈ వ్యవస్థ విద్యుత్‌ ఫీ డర్ల పనితీరును పర్యవేక్షించడంతో పాటు విద్యుత్‌ సరఫరాలో తలెత్తే అంతరాయాలు, ఓవర్‌లోడ్‌, వోల్టేజ్‌ హెచ్చుతగ్గుల వంటి సమస్యలను రియల్‌టైమ్‌లో గుర్తించి, సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయనుంది. స్కాడా కంట్రోల్‌ రూమ్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా పరిస్థితిని పర్యవేక్షిస్తూ, సమస్యలను వేగంగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చు. ఫీడర్‌పై విద్యుత్‌ లోడ్‌ పెరిగినప్పుడు, వోల్టేజ్‌ స్థాయిల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకున్నప్పుడు లేదా సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు అందుబాటులోకి వచ్చే రియల్‌టైమ్‌ సమాచారం సమస్య తీవ్రతను అంచనా వేయడానికి ఉపయోగపడనుంది. ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించడం ద్వారా సరఫరా వ్యవస్థలో తలెత్తే లోపాలను గుర్తించి, వాటి ప్రభావాన్ని తగ్గించే చర్యలు చేపట్టవచ్చు.

సర్కిల్‌ పరిధిలోని 97 సబ్‌స్టేషన్లను స్కాడాకు అనుసంధానం చేసి విద్యుత్‌ సరఫరా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం జరిగింది. రియల్‌టైమ్‌ సమాచారం ఆధారంగా సమస్యలను గుర్తించడం, అవసరమైన సిబ్బందిని అప్రమత్తం చేయడం, సరఫరా పునరుద్ధరణను వేగవంతం చేయడం వంటి అంశాల్లో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది. – ఐరెడ్డి విజేందర్‌రెడ్డి,

ఎస్‌ఈ, కరీంనగర్‌ సర్కిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement