ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌కు చెందిన బి.వీరయ్య(71) నగరశివారులోని ఎల్లమ్మ గుడి వెనుక ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీ వర్క్‌షాప్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేసిన వీరయ్య 2014లో ఉద్యోగవిరమణ పొందాడు. 2013 నుంచి సయాటికతో పాటు మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని చిన్న కుమారుడి ఇంటికి వెళ్లాడు. బుధవారం ఎవరికీ చెప్పకుండా కరీంనగర్‌ వచ్చాడు. ఎల్లమ్మగుడి ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పెద్ద కుమారుడు క్రాంతికుమార్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బావిలో పడి మహిళ ..

కాల్వశ్రీరాంపూర్‌: కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన అట్టెపెల్లి వెంకటమ్మ(50) అనే మహిళ గురువారం వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం కుమారుడు అనిల్‌, రెండేళ్ల క్రితం భర్త వీరయ్య మృతి చెందారన్నారు. కూతురు రమ్యకు వివాహాం చేయడంతో వెంకటమ్మ ఒంటరిగానే జీవిస్తోందని, ఒంటరితనం భరించలేకనే వెంకటమ్మ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కూతురు రమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement