గన్నేరువరం: సద్దుల బతుకమ్మ ఆడనివ్వకుండా గ్రామ పెద్దలు, కుల సంఘ సభ్యులు అవమానపరిచారని మండలంలోని కూనవానిపల్లెకు చెందిన కూన భారతిమల్లయ్య దంపతులు ఆరోపించారు. గురువారం విలేకర్లతో మాట్లాడారు. ముదిరాజ్లు బతుకమ్మ ఆడుతున్న ప్రదేశంలో బతుకమ్మ పెట్టగా కుల సంఘం సభ్యులు అడ్డుకున్నారని, మిమ్మల్ని కులం నుంచి వెలివేశాం, ఇక్కడ బతుకమ్మ పెట్టొద్దు అంటూ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. డయల్ 100 సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి సర్దిచెప్పిన కాసేపటికే బతుకమ్మను పక్కకు తొలగించారని, న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.


