వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వరస్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నినాల జయసూర్య దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న జడ్జికి ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ మండపంలో డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్ శేషవస్త్రం కప్పి సత్కరించారు. జిల్లా సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘన, వేములవాడ టౌన్ సీఐ వీరప్రతాప్, ఆలయ ఏఈవో జయకుమారి, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, పీఆర్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.


