రూ.2.80 కోట్లతో బతుకమ్మ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

రూ.2.80 కోట్లతో బతుకమ్మ ఏర్పాట్లు

Oct 9 2026 1:44 AM | Updated on Oct 9 2026 1:44 AM

● డంప్‌యార్డ్‌ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం ● మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: బతుకమ్మ, దసరా ఉత్సవాలను నగరంలో రూ.2.80 కోట్లతో ఘనంగా నిర్వహించనున్నట్లు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై నగరపాలకసంస్థలో గురువారం డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌రావు, కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌తో కలిసి ఇంజినీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌, శానిటేషన్‌ విభాగాలతో సమీక్షించారు. 66డివిజన్లలో బతుకమ్మ, నిమజ్జనం పాయింట్లు, అంబేడ్కర్‌ స్టేడియంలో దసరా ఉత్సవాలకు చేయాల్సిన సివి ల్‌, ఎలక్ట్రికల్‌ పనులు, పారిశుధ్య నిర్వహణపై చర్చించారు. రూ.2.80 కోట్లతో ఏర్పాట్లు చేపట్టా మని, టెండర్‌ పూర్తి చేశామన్నారు. టెండర్‌ దక్కించుకొన్న కాంట్రాక్టర్లు మూడు రోజుల ముందుగానే పనులు పూర్తి చేసేలా ఇంజినీరింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌ ఆయాజ్‌, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్‌ మొహియుద్దీన్‌, వేణు మాధవ్‌, సహాయ కమిషనర్‌ రాజమనోహర్‌, ఇన్‌చార్జి ఈఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.

డంప్‌యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం

డంప్‌యార్డు సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కా రం చూపుతామని మేయర్‌ శ్రీనివాస్‌ అన్నారు. స్వ చ్ఛ్‌ భారత్‌ మిషన్‌లో ప్రక్షాళన చేసేందుకు రూ.17 కోట్లు కేటాయించామన్నారు. గురువారం 52వ డివిజన్‌ పరిధిలోని క్రిస్టియన్‌కాలనీలో కార్పొరేటర్‌ సరిల్ల రాజకుమారితో కలిసి సుడానిధులు రూ.24 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ, సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంప్‌యార్డు సమస్య పరిష్కారానికి స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌లో రూ.17 కోట్ల కేటాయించామని, టెండర్‌ పూర్తి చేసి ఈఎన్‌సీ అనుమతి పొందామన్నారు. యూసీఎఫ్‌ పథకంలోనూ రూ.80 కోట్ల ప్రతిపాదనలు పెట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement