● కరీంనగర్‌కు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ● వైశ్యాభవన్ నుంచి ప్రారంభం కానున్న యాత్ర
కరీంనగర్: బీజేపీ జాతీయ అఽ ద్యక్షుడు నితిన్ నబిన్ ఈనెల 23న కరీంనగర్‌కు రానున్నా రు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో లక్ష మందితో ‘మహా పాదయాత్ర’ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం–అరాచకత్వాన్ని పాతరేద్దాం’ అనే నినాదంతో నిర్వహించనున్న ఈ యాత్ర మధ్యాహ్నం 12 గంటలకు వైశ్యాభవన్ నుంచి ప్రారంభమై టవర్ సర్కిల్, శాసీ్త్రరోడ్ మీదుగా కమాన్ వరకు కొనసాగనుంది. నితిన్ నబిన్‌తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్, సహ ఇన్‌చార్జీలు రేఖాశర్మ, అభయ్ పాటిల్ పాల్గొననున్నారు. యాత్ర నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల నుంచి భారీగా జనసమీకరణ చేపట్టాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పార్టీ నాయకులకు సూచించారు.
నేడు చెక్ బౌన్స్ కేసుల ప్రత్యేక లోక్ అదాలత్
కరీంనగర్‌క్రైం: చెక్‌బౌన్స్ కేసు ల త్వరిత పరిష్కారమే లక్ష్యంగా నేడు జిల్లాలోని అన్ని కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి యశ్వంత్ సింగ్ తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో మేజిస్ట్రేట్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న చెక్‌బౌన్స్ కేసులతో పాటు జిల్లా కోర్టుల్లో విచారణలో ఉన్న క్రిమినల్ అప్పీల్ చెక్‌బౌన్స్ కేసులు పరిష్కరి స్తారన్నారు. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో రాజీ ద్వారా కేసులకు ముగింపు పలికే అవకాశం ఉంటుందన్నారు. చెక్ బౌన్స్ కేసులతో న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నేరస్తులకు శిక్ష పడేలా పటిష్ట దర్యాప్తు
కరీంనగర్ క్రైం: నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా పటిష్ట దర్యాప్తు చేపడుతున్నామని సీపీ గౌస్‌ఆలం తెలిపారు. 2026 నవంబర్ 19 వరకు మొత్తం 29 కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు జైలుశిక్షలు, జరిమానాలు విధించాయన్నారు. హత్య, పోక్సో, గంజా యి, రోడ్డు ప్రమాదాలు, కట్నం వేధింపులు వంటి కేసులు ఇందులో ఉన్నాయన్నారు. ఇటీవల ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్‌పరిధిలో నమోదైన హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు పడటం ఈ ఏడాది సాధించిన మరో కీలక విజయమన్నారు. పక్కా ఆధారాలతో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సీపీ అభినందించారు.


