కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. శుక్రవారం 1, 2, 3 ,25, 26 డివిజన్లలో ఏర్పాటు చేసిన శిబిరాలను మేయర్ కొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్లు వైద్యుల అంజన్ కుమార్, గంట శ్రీనివాస్ ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణలో జాప్యం జరగకుండా, వివరాల సేకరణ, నమోదు ప్రక్రియలో లోటుపాట్లు జరగకుండా చూ డాలని అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్‌తో ఖచ్చితమైన వివరాలను అందించి,రూ.5 లక్షల బీమాను నమోదు చేసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం డి సెంబర్ 18 లోపు ప్రత్యేక శిబిరాలకు వచ్చి బీమా సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. మరో వైపు 11,40,41 డివిజన్లలో కార్పొరేటర్లు ఆకుల నర్మద నర్సయ్య, రేణుకా శ్రీనివాస్‌లతో కలిసి నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ శిబిరాలను ప్రారంభించారు.


