తుపానులో మీ సేవలు భేష్‌ | - | Sakshi
Sakshi News home page

తుపానులో మీ సేవలు భేష్‌

Nov 21 2026 12:14 AM | Updated on Nov 21 2026 12:14 AM

కొత్తపల్లి(కరీంనగర్‌): ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం ప్రాంతంలో అర్నాబ్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌ లైన్లను పునరుద్ధరించడంలో విశేష సేవలందించిన టీజీఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ సిబ్బంది, కాంట్రాక్టర్లను సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఏ.విజయేందర్‌ రెడ్డి శుక్రవారం ఘనంగా సన్మానించారు. గత నెల 30 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు నోడల్‌ అధికారి రవి ఆధ్వర్యంలో ఐదు కాంట్రాక్టర్‌ బృందాలు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనుల్లో కీలక పాత్ర పోషించాయి. విపత్కర పరిస్థితుల్లోనూ అంకితభావంతో పనిచేసి న వారి సేవలు అభినందనీయమని విజయేందర్‌ రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా నోడల్‌ అధికారి రవి, కాంట్రాక్టర్ల ప్రతినిధులు ప్రవీణ్‌, శ్రీనివాసరెడ్డి, భాస్కర్‌, రామ్‌రెడ్డి, నవీన్‌లను సన్మానించారు. కార్యక్రమంలో డీఈ కె.ఉపేందర్‌, ఏడీఈలు, ఏఈలు, విద్యుత్‌ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

దశాబ్దాల కల త్వరలోనే సాకారం

కరీంనగర్‌ అర్బన్‌: 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రేషన్‌ డీలర్ల సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని సివిల్‌ సప్లై కమిషనర్‌ వై.నాగిరెడ్డి హామీ ఇచ్చారని రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రొడ్డ శ్రీనివాస్‌ తెలిపా రు. రేషన్‌ డీలర్ల ప్రధాన సమస్యలపై రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజుతో కలిసి శుక్రవారం కమిషనర్‌కు విన్నవించారు. రేషన్‌ డీలర్లకు నెలకు రూ.5,000 గౌరవ వేతనం మంజూరు చేయాలని, క్వింటాలుకు రూ.300 కమిషన్‌ పెంచాలని కోరారు. దిగుమతి హమాలీని ప్రభుత్వమే భరించాలని, ప్రతి రేషన్‌ డీలర్‌కు హెల్త్‌ కార్డులు అందజేయాలని డిమాండ్‌ చేశారు. నాగిరెడ్డి స్పందిస్తూ తన పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ప్రభుత్వ పరిధిలోని అంశాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సివిల్‌ సప్లై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

గ్రంథాలయాలతోనే జ్ఞానం

కరీంనగర్‌ కల్చరల్‌: గ్రంథాలయాలతోనే జ్ఞాన సముపార్జన సాధ్యమని, ఉన్నత స్థితికి ఎదగాలంటే పుస్తక పఠనం అవసరమని ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలో మాట్లాడారు. పుస్తక పఠనం ద్వారా అజ్ఞానం తొలగి విజ్ఞానం పెరుగుతుందన్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, వ్యక్తిత్వ వికాస గ్రంథాలు ప్రభుత్వ గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వినియోగించుకొని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ముదిగంటి సుధాకర్‌ రెడ్డి, సంగెం లక్ష్మణరావు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.శశిజాదేవి పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.8,980

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్‌ పత్తి గరిష్టంగా రూ.8,980 పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 111 వాహనాల్లో 1,049 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్‌ ధర రూ.8,900, కనిష్ట ధర రూ.8,700కు వ్యాపారులు కొనుగోలు చేశారు. శని, ఆదివారాలు యార్డుకు సాధారణ సెలవులు ఉంటాయని, సోమవారం యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయని చైర్‌పర్సన్‌ పూల్లూరి స్వప్నసదానందం, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్‌–2 కార్యదర్శి రాజా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement