సారూ.. ఊపిరి పోయరూ..! | - | Sakshi
Sakshi News home page

సారూ.. ఊపిరి పోయరూ..!

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

పెద్దపల్లిరూరల్‌: రెక్కాడితేనే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబాన్ని విధి పగబట్టింది. భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుని పొట్ట పోసుకుంటున్న తరుణంలో ప్రాణాంతక వ్యాధి వ్యాపించింది. ఊపిరితిత్తుల వ్యాధితో కరీంనగర్‌ ఆస్పత్రిలో చావుబతుకుల నడుమ పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్‌ గ్రామానికి చెందిన కోట గౌరమ్మ పోరాడుతోంది. గౌరమ్మ వ్యవసాయ పనులకు వెళుతుండగా భర్త శ్రీనివాస్‌ తాటికల్లు అమ్మడం ద్వారా వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబం వెళ్లదీస్తున్నారు. వీరికి ఇద్దరు కూ తుళ్లు సంతానం. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధిబారిన పడి 15రోజులుగా చికిత్స పొందుతుండగా ఇప్పటికే రూ.5లక్షల దాకా అప్పులు వెచ్చించారు.

దాతలు దయచూపితేనే..

రోజూ వైద్యం ఖర్చులు, మందుల కోసం రూ. వేలు అవసరమవుతుండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో దాతలు ఇచ్చే ఆపన్నహస్తం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. తన భార్య గౌరమ్మను బతికించుకోవాలనే ఆశతో తన శాయశక్తులా ప్రయత్నించి అక్కడ, ఇక్కడ తెచ్చి న డబ్బంతా ఖర్చు చేశానని శ్రీని వాస్‌ వాపోయాడు. ఇప్పుడు చేతిలో పైసా లేదని, ఏం చేయాలో తెలియదని కన్నీటి పర్యంతమయ్యాడు. చావుబతుకుల నడుమ పోరాడుతున్న గౌరమ్మ వైద్యం కోసం దాతలు, స్వచ్ఛంద సంస్థ లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమవంతు సహకారం అందించాలని వేడుకుంటున్నారు.

దాతలు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు: 80082 34112, 93816 60378

దాతలు ఆదుకుంటేనే ఆ పేద కుటుంబానికి ఆసరా

చికిత్స కోసం ఇప్పటికే రూ.5లక్షలదాకా ఖర్చు

ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న గౌరమ్మ కుటుంబం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement