ఇళ్లు కోల్పోతున్న వారికి పునరావాసం కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్లు కోల్పోతున్న వారికి పునరావాసం కల్పించాలి

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

చిగురుమామిడి: కొత్తపల్లి నుంచి చిగురుమామిడి ద్వారా హుస్నాబాద్‌కు వెళ్లే ఫోర్‌లేన్‌ రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న వారికి పునరావాసం కల్పించడంతో పాటు తగిన నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం చిగురుమామిడిలో బాధితులు చేపట్టిన రిలేనిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించారు. రహదారి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఇళ్లు కూల్చినష్టపరిహారం ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. బాధితుల సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు అందె చిన్నస్వామి, తేరాల సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌ గోలి బాపురెడ్డి తదితరులున్నారు. కాగా ఈ దీక్షా శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ సింగిల్‌విండో చైర్మన్‌ కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు పోలోజు సంతోష్‌కుమార్‌, గునుకులపల్లె సర్పంచ్‌ గునుకుల మధుసూదన్‌రెడ్డి, మాజీ జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement