కొడిమ్యాల: ప్రమాదవశాత్తు విద్యుత్‌షాకు గురై మహిళ మృతి చెందింది. ఈ ఘటన కొడిమ్యాలలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జనగం రూప(34) ఉదయాన్నే ఇంటి పనుల్లో నిమగ్నమైంది. బట్టలు ఉతికి, ఆరేసే సమయంలో లూజ్ వైరు తగిలి షాక్‌కు గురైంది. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రూప భర్త నరేశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. వీరికి 6,7 ఏళ్ల వయసున్న ఇద్దరు కొడుకులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


