గోదావరిఖనిటౌన్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఇటీవల ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థి అలుగువెల్లి ఉభయరెడ్డి ‘నౌ యువర్ లీడర్’ అంశంపై ఢిల్లీలో ప్రసంగించి జాతీయస్థాయి లో ప్రతిభ చాటాడు. జాతీయ నేతల జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం కోసం కేంద్ర క్రీడలు, యువజన శాఖ ఈ కార్యక్రమం నిర్వహించింది. మాజీ ప్రధాని లాల్ బహు దూర్ శాస్త్రి సేవలు, పాటించిన విలువల గురించి ఉభయరెడ్డి ప్రసంగించి ప్రతిభ కనబరిచాడు. తెలంగాణ నుంచి ఇతడొక్కడే ప్రాతినిధ్యం వహించడం విశేషం. భారత్ యూత్ పార్లమెంట్–2026లో రాష్ట్రస్థాయిలోనూ ఐదో స్థానం సాధించాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ వై.ప్రసాద్, అధ్యాపకులు రవి, అంబిక, రఘుపతి, సుధా, అనిల్, రవీందర్, శ్యాంప్రసాద్, సతీశ్, జ్యోతి, విద్యార్థులు అభినందించారు.
ఫొటోగ్రాఫర్‌కు జాతీయ అవార్డు
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన ఉప్పు ముత్యం హైదరాబాద్ ఫొటో ఎక్స్, సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించిన జాతీయస్థాయి వెడ్డింగ్ పోటీల్లో అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా 99మంది పోటీలకు హాజరవగా.. ముత్యం తీసిన చిత్రాలు అవార్డుకు ఎంపికయ్యాయి. శంషాబాద్‌లో శుక్రవారం ఎంపీ శేఖర్ నుంచి అవార్డు అందుకున్నారు. ఆయనను కొలనూరు గ్రామస్తులు అభినందించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ధర్మపురి: జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి(60) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై సధాకర్ తెలిపారు. పట్టణంలో కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. శుక్రవారం అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మృతి చెందాడు. ఎవరికై న ఆచూకీ తెలిస్తే 8712656824 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు.
వాటర్ ట్యాంకర్‌ను ఢీకొన్న బైక్
● చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
జగిత్యాలక్రైం: బీర్‌పూర్ మండలం తాళ్ల ధర్మారం గ్రామంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్‌ను ద్విచక్రవాహ నం ఢీకొంది. ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి చికిత్స పొందుతూ శుక్రవారం చెందాడు. బీర్‌పూర్ మండలంలోని తాళ్ల ధర్మారంకు చెందిన బర్ల దినేశ్ (15) కొల్వాయి ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం బైక్‌పై బయటకు వెళ్లాడు. ఎంపీయూపీ పాఠశాల వద్ద బైక్‌ను వేగంగా నడుపుతూ అదుపు తప్పి, రోడ్డు పక్కన ఆగి ఉన్న వాటర్ ట్యాంకర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దినేష్ ముఖం, కుడి కన్ను, ఛాతీపై తీవ్ర గాయాయ్యాయి. గ్రామస్తులు చికిత్స కోసం 108 ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి బర్ల రాజేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు బీర్‌పూర్ ఎస్సై రాజు తెలిపారు.


