జైలు జీవితం మార్పునకు నాంది | - | Sakshi
Sakshi News home page

జైలు జీవితం మార్పునకు నాంది

Oct 3 2026 12:44 AM | Updated on Oct 3 2026 12:44 AM

జైలు జీవితం మార్పునకు నాంది ● జిల్లా జైలులో గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం

కరీంనగర్‌క్రైౖం: జైలు జీవితం శిక్షకు మాత్రమే పరిమితం కాకుండా జీవితంలో మార్పునకు నాంది కావాలని జిల్లా జడ్జి ఎస్‌.శివకుమార్‌ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లా జైలులో శుక్రవారం ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్‌.శివకుమార్‌ అధ్యక్షత వహించగా.. కలెక్టర్‌ చిత్రా మిశ్రా, పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి యశ్వంత్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జైలు పర్యవేక్షణాధికారి జి.విజయ డేని వార్షిక నివేదికను సమర్పించారు. జడ్జి ఎస్‌.శివకుమార్‌ మాట్లాడుతూ.. గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చూపిన సత్యం, సరళత, నిష్కపటత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి జైలు సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సీపీ మాట్లాడుతూ.. ఖైదీల సంస్కరణ కోసం జైళ్ల శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి మాట్లాడుతూ.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని జీవితాన్ని మార్చుకోవాలని సూచించారు. జైలు వైద్యాధికారి డాక్టర్‌ కె.వేణుగోపాల్‌, నాన్‌ అఫిషియల్‌ విజిటర్స్‌, న్యాయ సేవా ప్రతినిధులు, జైలర్లు జి.లక్ష్మీనారాయణ, బి.రమేశ్‌, డిప్యూటీ జైలర్లు ఎస్‌.సుధాకర్‌రెడ్డి, కె.అనిల్‌కుమార్‌, ఎస్‌.అజయ్‌చారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement