పర్యావరణ హితానికి సోలార్‌ విద్యుత్‌ | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ హితానికి సోలార్‌ విద్యుత్‌

Oct 3 2026 12:44 AM | Updated on Oct 3 2026 12:44 AM

పర్యావరణ హితానికి సోలార్‌ విద్యుత్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగర ప్రజలు పర్యావరణ హితమైన సోలార్‌ విద్యుత్‌ను ఉపయోగించుకోవాలని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలి యోజన సోరాల్‌ రూఫ్‌టాప్‌ ఎక్స్‌ఫ్లోను ప్రారంభించారు. ఇంటిపై సోలార్‌ ప్యానెళ్లు అమర్చుకోవడం వల్ల ఉచిత విద్యుత్‌ను పొందడమే కాకుండా మిగులు విద్యుత్‌ను విక్రయించుకోవచ్చన్నారు. ప్రధాన మంత్రి సూర్యఘర్‌ స్కీంను నగర ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు, నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌, అదనపు కమిషనర్‌ ఆయాజ్‌, డిప్యూటీ కమిషనర్‌లు ఖాదర్‌ మొహియొద్దిన్‌, వేణుమాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

పవర్‌ కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: డీటీఆర్‌ నిర్వహణ, లైన్‌ పనుల కారణంగా శనివారం ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు 11 కేవీ గంజ్‌ ఫీడర్‌ పరిధిలో అన్నపూర్ణ కాంప్లెక్స్‌, మార్కెట్‌ ఏరియా, గంజ్‌ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ కాపువాడ ఫీడర్‌లో మీరా హాస్పిటల్‌ ఏరియా, గౌరిశెట్టి కాంప్లెక్స్‌, బొమ్మ వెంకన్న బిల్డింగ్‌, అహ్మద్‌పురా, సహజ, జేఎన్‌, కన్యకా పరమేశ్వరి బాంకెట్‌ హాళ్ల పరిసరాలు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు కొత్త 11 కేవీలైన్‌ ఏర్పాటు పనుల కారణంగా కట్టరాంపూర్‌ మెయిన్‌ రోడ్డు, తిరుమలనగర్‌, శ్రేయం అపార్ట్‌మెంట్‌, రెడ్డికాలనీ, విజేత అపార్ట్‌మెంట్‌, మైనార్టీ స్కూల్‌, హనుమాన్‌నగర్‌, మౌలిక చంద్ర అపార్ట్‌మెంట్‌, స్కైలైన్‌ అపార్ట్‌మెంట్‌ పరిసరాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నట్లు టౌన్‌ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్‌, ఎం.లావణ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement