మహాత్మాగాంధీ నోట నిత్యం రామనామమే..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
1976లో ఏపీ సూపర్‌ఫాస్ట్‌గా ప్రస్థానం మొదలు 2015లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం ఉత్తర తెలంగాణ ప్రజలు ఢిల్లీ వెళ్లేందుకు అనువైన రైలు పెద్దపల్లిలో హాల్టింగ్ ఇస్తే ఉమ్మడి జిల్లావాసులకు సౌకర్యం
న్యూస్‌రీల్
జిల్లావ్యాప్తంగా శుక్రవారం గాంధీజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్ముడి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రతీ ఒక్కరు బాపూజీ అడుగుజాడల్లో నడవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు కోరారు. కలెక్టరేట్‌లో మాజీ ప్రధాని లాలాబహదూర్ శ్రాస్త్రి జయంతి నిర్వహించారు. ఆయాప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కలెక్టర్ చిత్రామిశ్రా, సీపీ గౌస్ ఆలం, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, ఆర్‌ఐ జానిమియా, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, వరాల నర్సింగం, మల్లికార్జున రాజేందర్, గడ్డం విలాస్‌రెడ్డి, కర్ర సత్యప్రసన్నరెడ్డి, పురం రాజేశ్, లింగంపల్లి బాబు, కర్ర రాజశేఖర్, వెన్న రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్/కరీంనగర్ అర్బన్/కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్ క్రైం
‘మహా’
నివాళి
తెలంగాణ ఎక్స్‌ప్రెస్..
50 ఏళ్ల మజిలీ
జమ్మికుంట: గాంధీ జీవితాంతం రామనామమే జపించిన మహానీయుడని, హిందూ సనాతన ధర్మాన్ని ఆచరించారని, రామరాజ్యాన్ని అచరణలో చూపుతోంది మోడీ, బీజేపీయేనని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జమ్మికుంటలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరై గాంధీ చౌక వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. శ్రీరాముడు సంపన్నుల దేవుడని సీఎం అంటున్నాడని, మరి జీవితాంతం కటిక నేలపై నిద్రించి, నిత్యం రామ నామం జపించిన గాంధీ సంపన్నుడా అని ప్రశ్నించారు. నేటి కాంగ్రెస్ మాత్రం ఇటలీ నేషనల్ కాంగ్రెస్‌గా మారి వారసత్వ , అవినీతి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ ఏనాడు ప్రజలను పట్టిచుకున్న దాఖలాల్లేవని, గాంధీ, అబేంద్కర్ వంటి మహనీయుల జయంతి, వర్ధంతి రోజు బయటకు రాకుండా ఎన్నికల సమయంలో వస్తాడన్నారు.


