కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కళాశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా అండర్–19 బాలికల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నారీ శక్తికి అద్ధం పట్టాయి. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాలికలతో మైదానం పచ్చటి వేదికలా మారింది. ఒకవైపు బుల్లెట్ వేగంతో దూసుకొచ్చే బంతులను దీటుగా ఎదుర్కొంటూ అదిరిపోయే బ్యాటింగ్, మరోవైపు వికెట్లను ముద్దాడుతూ అద్భుతమైన బౌలింగ్ విన్యాసాలు.. చూసే కళ్లకు క్రీడా పండుగను పంచాయి. పోటీలను అండర్ 19 జిల్లా కళాశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి ఎల్ బన్సిలాల్ పర్యవేక్షించి ఉత్తమ జట్టును ఎంపిక చేశారు.
– కరీంనగర్‌స్పోర్ట్స్


