అంబేడ్కర్‌ను అవమానించిన వ్యక్తిని అరెస్ట్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ను అవమానించిన వ్యక్తిని అరెస్ట్‌ చేయాలి

Sep 28 2026 1:29 AM | Updated on Sep 28 2026 1:29 AM

చందుర్తి(వేములవాడ): అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామిని అరెస్టు చేయాలని కోరుతూ రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఆదివారం దళిత సంఘాల నాయకులు ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నా విరమింపజేశారు. దళితసంఘాల నాయకులు మాట్లాడుతూ.. దళితులను దుర్భాషలాడుతూ అంబేడ్కర్‌పై దుర్భాషలాడిన రామస్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చందుర్తి ఎస్సైకి ఫిర్యాదు చేశారు. ధర్నాలో అంబేడ్కర్‌ డివిజన్‌ సంఘం అధ్యక్షుడు దుమ్ము ఆనంద్‌, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్‌, డివిజన్‌ అధ్యక్షుడు బత్తుల కమలాకర్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆవునూర్‌ ప్రభాకర్‌, జిల్లా కన్వీనర్‌ భిక్షపతి, బార్‌ అసోషియేషన్‌ మాజీ అధ్యక్షుడు గుడిసే సదానందం, అనిల్‌కుమార్‌, రుద్రంగి మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు దప్పుల అశోక్‌, తిమ్మాపూర్‌ సర్పంచ్‌ కాపిల్ల శంకర్‌, దళిత శక్తి ప్రోగ్రాం నాయకులు ప్రకాశ్‌, జింక శ్రీధర్‌, మనోజ్‌కుమార్‌, కటుకూర్‌ ప్రశాంత్‌, ఎస్‌.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

చందుర్తిలో దళిత సంఘాల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement