బద్దిపోచమ్మ గుడి పునరుద్ధరణ షురూ.. | - | Sakshi
Sakshi News home page

బద్దిపోచమ్మ గుడి పునరుద్ధరణ షురూ..

Sep 28 2026 1:29 AM | Updated on Sep 28 2026 1:29 AM

వేములవాడ: వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయ పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. రూ.10కోట్లతో ఈ పనులు చేపట్టారు. భవిష్యత్‌లో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం రెండు గుంటల విస్తీర్ణంలోనే ఉన్న బద్దిపోచమ్మ గుడిని 38 గుంటల్లో పునర్‌ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు.

85 శాతం పూర్తయిన పనులు

బద్దిపోచమ్మ ప్రధాన భాగం మినహా మిగతా 85 శాతం పనులు పూర్తయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో షాపింగ్‌ కాంప్లెక్స్‌, బోనాల సమర్పణకు ప్రత్యేక మండపం, పట్నాలు వేసే స్థలం, భక్తుల కోసం విశాలమైన క్యూలైన్లు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.

కూల్చివేతలు ప్రారంభం

ఆలయ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో భక్తుల దర్శనాలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ప్రధాన ఆలయం వద్ద రెండు వైపులా భద్రత గోడలు నిర్మించి, క్యూలైన్‌ ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అమ్మవారు కొలువై ఉన్న ప్రధాన భాగం మినహా మిగిలిన పాత నిర్మాణాల కూల్చివేత పనులు మొదలయ్యాయి.

భక్తులకు ఇబ్బందులు కలుగనివ్వం

భక్తులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తగా పనులు చేపడుతున్నాం. శుక్రవారం నుంచే పనులు ప్రారంభించాం. అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతాన్ని వదిలేసి మిగతా ప్రాంతాన్ని జాగ్రత్తగా కూల్చి వేస్తున్నాం. పనులు త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం.

– రఘునందన్‌, డీఈ

ప్రధాన ఆలయం కూల్చివేతలు మొదలు

ఇప్పటి వరకు రెండు గుంటల్లోనే గుడి

ప్రస్తుతం 38 గుంటల్లో నిర్మాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement