వృద్ధుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడి ఆత్మహత్య

Sep 28 2026 1:29 AM | Updated on Sep 28 2026 1:29 AM

కాల్వశ్రీరాంపూర్‌: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం మంగపేట గ్రామానికి చెందిన న్యాల రాజయ్య(65) కడుపు నొప్పి బాధ భరించలేక ఆదివారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాజయ్య కొంతకాలంగా హెర్నియా సమస్యతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో నొప్పితీవ్రతరం కావడంతో తాళలేక పురుగులమందు తాగాడు. పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లిన బంధువులకు విషయాన్ని ఫోన్‌చేసి చెప్పాడు. కుటుంబ సభ్యులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత కరీంనగర్‌ తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు.

ఉరేసుకుని యువకుడి..

మల్యాల: కడుపు నొప్పితో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బల్వంతాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్‌ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని దొరపల్లి గ్రామానికి చెందిన రాచూటి అద్దాలఎల్లయ్య కుటుంబంతోపాటు వచ్చి బట్టల వ్యాపారం చేసుకుంటూ జగిత్యాల రూరల్‌ మండలం నర్సింగాపూర్‌లో నివాసముంటున్నారు. కుమారుడు చరణ్‌ (24) కొద్దికాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఆదివారం బట్టల వ్యాపారం కో సం కొండగట్టుకు వెళ్లి.. తిరిగి రాలేదు. ఫోన్‌ స్వి చ్ఛాప్‌ రావడంతో పరిసర గ్రామాల్లో వెదకగా.. బల్వంతాపూర్‌ శివారులో చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. చరణ్‌ తండ్రి ఎల్లయ్య ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య

పెగడపల్లి: సెల్‌ఫోన్‌ కొనివ్వలేది గడ్డి మందు తాగిన ఓ బాలుడు ఆత్మహత్యాయత్నం చేసి.. చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మండలంలోని రాజరాంపల్లితండాలో చోటుచేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. తండాకు చెందిన ఇస్లావత్‌ నరేశ్‌నాయక్‌, జయ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడుగణేశ్‌నాయక్‌ (14) రామడుగు మండలం గోపాల్‌రావుపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. సెల్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరుతున్నాడు. వద్దని మందలించగా.. మనస్తాపానికి గురై ఈనెల 15న ఇంటి వద్ద గడ్డి మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. నరేశ్‌నాయక్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

30న ఉమ్మడి జిల్లా సీనియర్‌ ఖోఖో జట్ల ఎంపిక

కరీంనగర్‌స్పోర్ట్స్‌: కరీంనగర్‌ జిల్లా ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా (పెద్దపల్లి జిల్లా మినహా) సీనియర్‌ ఖోఖో జట్ల ఎంపిక పోటీలను ఈనెల 30న నిర్వహించనున్నారు. మహిళలు, పురుషుల విభాగాలలో ఈ పోటీలను జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహించనున్నామని జిల్లా ఖోఖో అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వై.మహేందర్‌ రావు తెలిపారు. ప్రతిభ గల 14ఏళ్లు నిండిన బాలికలు, 16ఏళ్లు నిండిన బాలురు ఈ పోటీలలో పాల్గొనుటకు అర్హులని తెలిపారు. ప్రతిభ చాటే క్రీడాకారులను అక్టోబర్‌లో నల్గొండలో నిర్వహించనున్న 59వ సీనియర్స్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నామని పేర్కొన్నారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు జిరాక్స్‌తో హాజరుకావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement