నేటి నుంచి ఎస్జీఎఫ్‌ అండర్‌–19 క్రీడాపోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎస్జీఎఫ్‌ అండర్‌–19 క్రీడాపోటీలు

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

కరీంనగర్‌స్పోర్ట్స్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను వెలికితీసేందుకు ప్రతిష్టాత్మక స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–19 టోర్నమెంట్లు, క్రీడాఎంపికల పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి అక్టోబర్‌ చివరి వరకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఎంపికల పోటీలు జరగనున్నట్లు అండర్‌–19 కార్యదర్శి బన్సిలాల్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లాస్థాయి ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు కళాశాల ఒరిజినల్‌ ఐడెంటిటీ కార్డులతోపాటు వాటి జిరాక్స్‌ కాపీ, లాంగ్‌ మెమో జిరాక్స్‌, ఇంటర్‌ మార్కుల షీట్‌, ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. బాలురకు కరీంనగర్‌లోని సాన్వి కళాశాలలో కబడ్డీ పోటీలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఉదయం 9 గంటలకు కళాశాలలో రిపోర్టు చేయాలని సూచించారు.

రేపు అండర్‌–14 క్రికెట్‌ జట్టు ఎంపిక

కరీంనగర్‌స్పోర్ట్స్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న అండర్‌–14 క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఈనెల 22న నిర్వహించనున్నట్లు కరీంనగర్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.మనోహర్‌రావు, ఉపాధ్యక్షులు ఎన్‌.మురళీధర్‌రావు, సి.మహేందర్‌గౌడ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ మీసేవ కేంద్రం నుంచి పొందిన జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, 2 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, పూర్తి క్రికెట్‌ యూనిఫామ్‌తో అలుగునూర్‌లోని కరీంనగర్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ మైదానానికి 22న ఉదయం 8.30 గంటలకు హాజరు కావాలని సూచించారు. 31–09–2012 నుంచి 01–09–2014 మధ్య జన్మించిన క్రీడాకారులు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు కేడీసీఏ ఇండోర్‌ ఇన్‌చార్జి డి.క్రాంతికుమార్‌ను సంప్రదించాలని, వివరాలకు 8688768775కు ఫోన్‌ చేయాలని సూచించారు.

ఆటోమేటిక్‌ సిగ్నల్‌ సిస్టం కేబుల్‌ చోరీ

ఓదెల: కాజీపేట్‌ నుంచి బల్లార్షా సెక్షన్ల మధ్యలో కొలనూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో రూ.2లక్షల విలువ చేసే ఆటోమేటిక్‌ సిగ్నల్‌ సిస్టం కేబుల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ప్రత్యక్ష సాక్షి రాజశేఖర్‌ కథనం ప్రకారం.. శనివారం రాత్రి టీవీఎస్‌ ఎక్సెల్‌, స్ల్పెండర్‌ బైక్‌పై నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి వచ్చారు. రైల్వే స్టేషన్ల మధ్యలో ఆటోమేటిక్‌ సిగ్నల్‌ సిస్టం కోసం వేస్తున్న 250 మీటర్ల కేబుల్‌ను చోరీ చేసి బైక్‌లపై వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతలో స్థానికులు ఎవరంటూ అరవడంతో వెంటనే కేబుల్‌ను టీవీఎస్‌ ఎక్సెల్‌పై పెట్టుకొని పరుగెత్తారు. మరో బైక్‌ను వదిలివెళ్లారు. సూపర్‌వైజర్‌ రాజశేఖర్‌ పొత్కపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై సనత్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌ చేసి వివరించారు. వెంటనే పోలీసులు చేరుకొని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement