పల్లెబడికి సాంకేతిక రెక్కలు | - | Sakshi
Sakshi News home page

పల్లెబడికి సాంకేతిక రెక్కలు

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

● సుకన్య ఎస్‌టీఈఎం ల్యాబ్‌కు

ధర్యపూర్‌ మోడల్‌ స్కూల్‌ ఎంపిక

ముత్తారం: పుస్తకాలతో కుస్తీ పట్టే బాలికల్లో దాగి ఉన్ననైపుణ్యాలను వెలికి తీసి.. ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సుకన్య ఎస్‌టీఈఎం ల్యాబ్‌లు ఎంతోగానో దోహదం చేస్తున్నాయి ప్రధానంగా సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌(ఎస్‌టీఈఎం)పై ఆసక్తి పెంచుతోంది.

తెలంగాణలో ధర్యపూర్‌ మోడల్‌ స్కూల్‌

ఎంపిక

మనదేశంలో ఇప్పటివరకు 32 సుకన్య ఎస్‌టీఈఎం ల్యాబ్‌లు ఉన్నాయి. ఈ ఏడాది 26 స్కూళ్ల ఎంపికవగా అందులో తెలంగాణ నుంచి ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలం ధర్యపూర్‌ మోడల్‌ స్కూల్‌కు చోటుదక్కింది. ప్రస్తుతం ల్యాబ్‌ పనులు ప్రారంభమయ్యాయి.

పాఠశాల నుంచే విమానయాన రంగం వైపు..

సుకన్య ఎస్‌టీఈఎం ల్యాబ్‌ ద్వారా ఆరు నుంచి పదో తరగతి వరకు బాలికలకు ప్రయోగాత్మక విద్య అందిస్తారు. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమటిక్స్‌తోపాటు ఏవియేషన్‌, ఏరో మోడలింగ్‌ కెరీర్‌ వైపు ప్రోత్సాహం అందిస్తారు. చిన్నవయసులోనే విమానం ఎలా ఎగురుతుంది, ఇందుకు ఉపయోగించే సాంకేతిక ఏమిటి? మోడల్‌ విమానాన్ని ఎలా తయారనే ఆలోచనలకు ల్యాబ్‌ ప్రయోగం కోసం ఉపయోగపడుతుంది. సాధారణంగా తరగతి గదిలో చదివే విషయాలను విద్యార్థులు ప్రయోగాలు, మోడల్స్‌, డిజిటల్‌ పరికరాలు తదితర కార్యకలపాల ద్వారా స్వయంగా చేసి నేర్చుకునేలా ఎస్‌టీఈఎం ల్యాబ్‌లు రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement