సుకన్య ఎస్‌టీఈఎం ల్యాబ్ ద్వారా గ్రామీణ బాలికల్లో నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తా. విద్యార్థులు ప్రతీఅంశంపై ప్రయోగం చేయొచ్చు. ల్యాబ్ మంజూరు చేసిన మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్, డీఈవోకు కృతజ్ఞతలు.
– కేసరి సంతోష్‌కుమార్, ప్రిన్సిపాల్, ధర్యపూర్ మోడల్ స్కూల్, ముత్తారం, పెద్దపల్లి జిల్లా
పేద విద్యార్థుల్లో సాంకేతిక విద్య
పేదవిద్యార్థు జీవితాల్లో సాంకేతిక విద్య ద్వారా వెలుగు నింపడమే లక్ష్యం. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో సుకన్య ఎస్‌టీఈఎం ల్యాబ్‌ను రాష్ట్రంలోనే మంథని నియోజకవర్గానికి మంజూరు చేయించాం. ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్‌లో ఏఐ ఆధారిత విద్యాబోధనకు ఎంపికై ంది. – శ్రీధర్‌బాబు, ఐటీ, పరిశ్రమల మంత్రి


