కరీంనగర్‌స్పోర్ట్స్: క్రీడల్లో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని అన్నారు. అంబేద్కర్ స్టేడియంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి పాఠశాలల క్రీడా సమాఖ్య క్రీడలు శనివారం ముగిశాయి. ఈసందర్భంగా విజేతలకు డీఈవో ట్రోఫీలు ప్రదానం చేశారు. మహిళా వ్యాయామ ఉపాధ్యాయులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే తనవద్దకు నేరుగా వచ్చి తెలియజేయవచ్చని పేర్కొన్నారు. విద్యాశాఖ ప్లానింగ్ ఆఫీసర్ మిల్కూరి శ్రీనివాస్, డీసీఈబీ కార్యదర్శి భగవంతరావు, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి బన్సిలాల్, పీడీలు, పీఈటీలు, పెటా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
అండర్– 14 బాలుర విజేతలు
అండర్– 14 బాలుర ఖోఖో విభాగంలో చొప్పదండి మండలం ప్రథమ, కొత్తపల్లి మండలం ద్వితీ య, కబడ్డీలో కరీంనగర్‌అర్బన్ మండలం ప్రథమ, చొప్పదండి మండలం ద్వితీయ, వాలీబాల్‌లో కొత్తపల్లి మండలం ప్రథమ, వీణవంక మండలం ద్వితీయ స్థానంలో నిలిచాయి.


