కరీంనగర్‌ జోరు.. ప్రత్యర్థుల బేజారు | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ జోరు.. ప్రత్యర్థుల బేజారు

Sep 20 2026 1:39 AM | Updated on Sep 20 2026 1:39 AM

కొత్తపల్లి(కరీంనగర్‌): నిజామాబాద్‌లో 3 రోజులుగా నిర్వహించిన టీజీ ట్రాన్స్‌కో/డిస్కం రాష్ట్రస్థాయి ఇంటర్‌ సర్కిల్‌ బాస్కెట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో కరీంనగర్‌ జట్టు సత్తా చాటింది. బాస్కెట్‌బాల్‌లో చాంపియన్‌గా నిలవడంతోపాటు టేబుల్‌ టెన్నిస్‌లో తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. శనివారం జరిగిన బాస్కెట్‌బాల్‌ ఫైనల్‌లో కరీంనగర్‌ జట్టు ఖమ్మం జట్టుపై 45–20 స్కోరుతో ఘన విజయం సాధించి విజేతగా నిలిచింది. బాస్కెట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ ఈఎల్‌పీ రాజు కీలక సమయాల్లో ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. జట్టు మేనేజర్‌, సీనియర్‌ ప్లేయర్‌ ఎ.రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. క్రీడాకారులు విశ్వతేజ, వినీత్‌, మేఘనాథ్‌, రమేశ్‌, సుధీర్‌కుమార్‌, రంగు వెంకటనారాయణ, వినీల్‌, ప్రశాంత్‌, మోయిన్‌ పాషా తదితరులు అద్భుతంగా రాణించారన్నారు. కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి ఎస్‌ఈలు అభినందించారు.

బాస్కెట్‌బాల్‌లో చాంపియన్‌.. టేబుల్‌ టెన్నిస్‌లో తృతీయ స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement