హోరాహోరీగా ఎస్జీఎఫ్‌ క్రీడలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా ఎస్జీఎఫ్‌ క్రీడలు

Sep 19 2026 6:20 AM | Updated on Sep 19 2026 6:20 AM

కరీంనగర్‌స్పోర్ట్స్‌: జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో ఎస్జీఎఫ్‌ క్రీడలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. శుక్రవారం అండర్‌– 17 బాలురకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌ పోటీలను నిర్వహించారు. జిల్లాలోని 16 మండలాల నుంచి 500 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. విజేతలకు డీసీఈబీ చైర్మన్‌ భగవంతరావు, జిల్లా విద్యా శాఖ సెక్టోరియల్‌ అధికారి అశోక్‌రెడ్డి ట్రోఫీలు ప్రదానం చేశారు. ఎస్జీఎఫ్‌ కార్యదర్శి బన్సిలాల్‌, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాబు శ్రీనివాస్‌, ఆడెపు శ్రీనివాస్‌, అంతటి శంకరయ్య, వేణుగోపాల్‌, పోతన శ్రీనివాస్‌, ఆర్‌.నరసయ్య, గిన్నె లక్ష్మణ్‌, వీరన్న, వంగపల్లి సూర్యప్రకాష్‌, బిట్ర శ్రీనివాస్‌, యూనిష్‌పాష, కొమురోజు కృష్ణ, చందా శ్రీనివాస్‌, ఎల్వీ రమణ, బాలసాని రాజకుమార్‌, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. కాగా, శనివారం అండర్‌– 14 బాలురకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు బన్సిలాల్‌ తెలిపారు.

అండర్‌– 17 బాలుర విజేతలు

అండర్‌– 17 బాలుర విభాగం ఖోఖోలో మానకొండూర్‌ మండలం ప్రథమ, చొప్పదండి మండలం ద్వితీయ, కబడ్డీలో చొప్పదండి మండలం ప్రథమ, తిమ్మాపూర్‌ మండలం ద్వితీయ, వాలీబాల్‌లో చొప్పదండి మండలం ప్రథమ, కరీంనగర్‌రూరల్‌ మండలం ద్వితీయ స్థానం సాధించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement