బోయినపల్లి(చొప్పదండి): మతి స్థితిమితం లేని ఓ వృద్ధురాలిని ఎస్సై ఎన్.రమాకాంత్ ఆ ధ్వర్యంలో పోలీసులు స్వగ్రామానికి ఆటోలో తరలించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండికి చెందిన వృద్ధురాలు కల్వకుంట్ల హేమలత మతిస్థిమితం కోల్పోయి బోయినపల్లి నుంచి దేశాయిపల్లి వెళ్లే రోడ్డుపై పడి ఉంది. ఏఎస్సై గంగరా జం, బ్లూకోల్ట్స్ సిబ్బంది లక్ష్మణ్, పర్శరామ్ గమనించి వివరాలు తెలుసుకున్నారు. ఏఎస్సై గంగరా జం గుండి గ్రామ సర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆటోలో స్వగ్రామానికి పంపించారు. వృద్ధురాలి వెంట హోంగార్డ్ పర్శరామ్‌ను పంపినట్లు పేర్కొన్నారు.


