గుర్తుతెలియని మహిళ మృతదేహం | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని మహిళ మృతదేహం

Sep 18 2026 1:57 AM | Updated on Sep 18 2026 1:57 AM

వెల్డర్‌ కుటుంబంలో తీరని విషాదం

కరీంనగర్‌రూరల్‌: బొమ్మకల్‌లోని కృష్ణానగర్‌కాలనీలో గురువారం అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. సుమారు 30 నుంచి 40 ఏళ్ల వయస్సు గల మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా ఉన్నట్లు వివరించారు.

మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

భీమదేవరపల్లి : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల శివారు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం భీమదేవరపల్లి శివారులో వాహనాల తనిఖీలో భాగంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల డ్రైవర్లను అనుమతి పత్రాలు చూపించాలని కోరామని, వారి వద్ద అనుమతి పత్రాలు లేని కారణంగా మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

సిరిసిల్లటౌన్‌/తిమ్మాపూర్‌: వినాయక చవితి పండుగకు ఇంటికి వచ్చి.. తిరిగి హాస్టల్‌కు వెళ్లిన విద్యార్థిని కరీంనగర్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన సిరిసిల్లలో విషాదం నింపింది. జిల్లా కేంద్రంలోని శివనగర్‌కు చెందిన కొడుముంజ మహేందర్‌ వెల్డింగ్‌షాప్‌ నిర్వహిస్తూ.. భార్య గాయత్రి, ముగ్గురు కుమార్తెలతో జీవిస్తున్నారు. పెద్దకూతురు మధుశ్రీ హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతుండగా, చిన్న కూతురు శ్రీనిధి సిరిసిల్లలో తొమ్మిదో తరగతి, రెండో కూతురు శ్రీవిద్య కరీంనగర్‌లో ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ డిప్లోమా చదువుతోంది. వారం క్రితం సెలవులు ఉండడంతో వినాయక చవితికి ఇంటికొచ్చి మంగళవారం తిరిగి హాస్టల్‌కు వెళ్లింది. బుధవారం రాత్రి హాస్టల్‌ నుంచి స్నేహితులతో కలిసి బయటకు వచ్చి.. తిరిగి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో సిరిసిల్లకు చెందిన శ్రీవిద్య మృతిచెందగా, మరో విద్యార్థిని భావన గాయపడింది.

హాస్టల్‌ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే..

హాస్టల్‌ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తన కూతురు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని మృతురాలు శ్రీవిద్య తండ్రి మహేందర్‌ ఆరోపిస్తున్నారు. కాలేజీకి సమీపంలోని ఎస్‌.ఆర్‌.రెడ్డి హాస్టల్‌లో ఉంటున్న తన కూతురు ఈనెల 16న ఆరోగ్యం సరిగా లేనందున కళాశాలకు వెళ్లలేదన్నారు. భావన తన కూతురిని బయటకు తీసుకెళ్లిందని, హాస్టల్‌లో ఉండే శ్రీలోహిత, శివప్రసన్న కూడా ఉన్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement