ట్రావెల్‌ బస్సు ఢీకొని ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రావెల్‌ బస్సు ఢీకొని ఒకరి మృతి

Sep 18 2026 1:57 AM | Updated on Sep 18 2026 1:57 AM

ట్రావెల్‌ బస్సు ఢీకొని ఒకరి మృతి

సుల్తానాబాద్‌రూరల్‌: సుల్తానాబాద్‌ బస్టాండ్‌ వద్ద గురువారం ట్రావెల్‌ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మెర్రి శంకర్‌ (50) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై చంద్రకుమార్‌ వివరాల ప్రకారం.. మానకొండూర్‌ మండలం ఊటూరుకు చెందిన మెర్రి శంకర్‌ కూతురు స్రవంతి అత్తగారి ఇళ్లయిన శ్రీరాంపూర్‌ నుంచి సుల్తానాబాద్‌కు వస్తుండటంతో తీసుకరావడానికి ద్విచక్రవాహనంపై సుల్తానాబాద్‌ బస్టాండ్‌కు వచ్చాడు. కూతురు వచ్చేసరికి ఆలస్యం అవుతుండటంతో బస్టాండ్‌ వైపు నుంచి కూడివైపునకు మృతుడు దాటుతుండగా పెద్దపల్లి నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న ట్రావెల్‌ బస్సు ఢీకొంది. తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని సుల్తానాబాద్‌ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement