వేములవాడఅర్బన్: రాజన్న అనుబంధ ఆలయం భీమేశ్వరస్వామి ఆలయంలో తెలుగు సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత కనకండ్ల సుభాష్ చంద్రబోస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇటీవల వివాహమైన తన కుమారుడు, కోడలితో కలిసి ఆలయానికి విచ్చేసిన చంద్రబోస్ దంపతులు, కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడెమొక్కు చెల్లించుకోవడంతోపాటు అభిషేకం, నిత్య కల్యాణం తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదములు అందజేశారు.


