కరీంనగర్: బ్యాంకింగ్ సమస్యల పరిష్కారానికి వివిధ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం
కరీంనగర్‌లో నిరసన ర్యాలీ చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్
(యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో భాగంగా నగరంలోని కేడీసీసీ బ్యాంకు
నుంచి తెలంగాణ చౌక్ మీదుగా యూనియన్ బ్యాంక్ బస్టాండ్‌శాఖ వరకు ర్యాలీ నిర్వహించారు. స్కేల్–4, పైస్థాయి అధికారులకు పీఎల్‌ఐ చెల్లింపులో వివక్షను విడనాడాలన్నారు. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ ఉద్యోగులు వి.దామోదర్, రాకేశ్, వెంకటేశ్, హరికృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, పోచయ్య, ప్రవీణ్, రాజు, రవీందర్, త్రివేణి, స్పందన, హరీశ్, మాధవరావు, హరి, సాయి పాల్గొన్నారు.


