సర్వీస్ రోడ్డు తప్పనిసరి
వినతి పత్రం ఇచ్చాం
నేషనల్ హైవేపై యూటర్న్ ఉంటుందని అనుకున్నాం. ఆ యూటర్న్ కచ్చితంగా మూసి వేసుడేనని తెలిసింది. యూటర్న్ దారి మూసి వేయడంతో మా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారికి రెండు వైపుల గ్రామం, వ్యవసాయ భూములు ఉన్నాయి. తప్పకుండా అండర్ పాస్ ఏర్పాటు చేయాలి. – గాలి సంపత్, ఖాదర్‌గూడెం
మా గ్రామానికి సర్వీస్ రోడ్డు లేకపోవడంతో గుట్టపక్కనున్న ప్రత్యామ్నాయ దారి గుండా ఇంటికి చేరుకుంటున్నాం. రోడ్డుకోసం ధర్నా, రాస్తారోకోలు చేశాం. కలెక్టర్, నేషనల్ హైవే అధికారులు పరిస్థితిని పరిశీ లించా రు. అయినా సర్వీస్ రోడ్డు వేయలే. – మీస శ్రీనివాస్, ఈదులగట్టెపల్లి
శంశాబాద్ నేషనల్ హైవేకు రెండు వైపుల ఉంది. అండర్ పాస్ లేకపోవడంతో గట్టుదుద్దెనపల్లి గుండా తిరి గి వస్తున్నాం. దూరం పెరిగింది. శంశాబాద్‌కు వెళ్లేందుకు అనువైన చోట అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చాం. – కొయ్యడ రామస్వామి, శంషాబాద్


