కరీంనగర్ కల్చరల్: జిల్లాలోని ప్రాచీన తాళపత్రాలు, గ్రంథాలు, శాసనాలు, పురాతన రచనలను గుర్తించి భద్రపరచాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జ్ఞాన్ భారతం మిషన్‌లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్కృతం, తెలుగు, ఉర్దూ, అరబిక్, పర్షియన్ తదితర భాషల్లో తాళపత్రాలు, రాగి లోహాలు, రాతిపై చెక్కిన పురాతన రచనలు, పద్యాలు, శాసనాలను గుర్తించాలన్నారు. జిల్లాలో మరుగునపడిన విలువైన గ్రంథాలు, శాసనాలను సేకరించి డిజిటలైజ్ చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎవ రి వద్దయినా పురాతన గ్రంథాలు, తాళపత్రాలు, శాసనాల సమాచారం ఉంటే 96409 67943కు తెలియజేయాలని సూచించారు.
కరెంట్ ఇవ్వలేని కాంగ్రెస్
చిగురుమామిడి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు, కరెంటు ఇవ్వలేని దుస్థితిలో ఉందని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నా యకుడు ఈటల రాజేందర్ అన్నారు. ఇటీవల మరణించిన మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ కుటుంబసభ్యులను శుక్రవారం చిగురుమామిడిలో పరామర్శించారు. రవీందర్ చిత్రపటా నికి పూలువేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు ఆరు గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కరెంటు సరిగా అందక రై తులు ఆందోళనకు దిగుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, శ్రీరామ్‌శ్యామ్, జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, పోలోజు సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
మీటింగ్‌కు వస్తేనే ఓటు హక్కు
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సర్వసభ్య సమావేశానికి స భ్యులు విధిగా హాజరుకావాలని, వరుసగా రెండుసార్లు గైర్హాజరైతే ఓటు హక్కు కోల్పోతారని కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ పీఐసీ చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక బ్యాంకు కార్యాలయంలో మాట్లాడుతూ కరీంనగర్ పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, మధురానగర్‌శాఖలకు సంబంధించిన సర్వసభ్య సమావేశం ఈ నెల 13న బీఆర్.అంబేద్కర్ స్టేడియంలో ఉదయం 11:00 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి కోరం తప్పనిసరని, అర్హత కలిగిన 1/10 సభ్యులు హాజరు కావాలని తెలిపారు. వరుసగా రెండు సర్వసభ్య సమావేశాలకు హాజరు కాని సభ్యులు నిబంధనల ప్రకారం ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి సభ్యుడు సమావేశానికి విధిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
కరీంనగర్‌టౌన్: మహిళలు తమ హక్కులపై అ వగాహన పెంచుకొని, అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత ఐలమ్మ అన్నారు. శుక్రవారం వాగేశ్వరీ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సాధికారత అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళల భద్రత, విద్య, సమాన అవకాశాలు, ఆత్మగౌరవం, హక్కులపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. తెలంగాణ చరిత్రలో ధైర్యం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించా రు. కళాశాల చైర్మన్ బీవీఆర్. గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. హిమవాణి ఎడ్యూకేషనల్ సొసై టీ జాయింట్ సెక్రటరీ రత్న, గంపల శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రమణ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


