కష్టాలు హై..వే! | - | Sakshi
Sakshi News home page

కష్టాలు హై..వే!

Sep 12 2026 12:00 AM | Updated on Sep 12 2026 12:00 AM

ఎన్‌హెచ్‌ 563 నిర్మాణంతో ఇరువైపులా గ్రామాలు అస్తవ్యస్తం

అండర్‌పాస్‌లు లేక రాకపోకలకు తిప్పలు

రెయిలింగ్‌ దూకుతూ.. రోడ్డు దాటుతూ..

జాతీయ రహదారిపై ప్రజల సర్కస్‌ ఫీట్లు

భయం భయంగా రోడ్డు దాటుతున్న వాహనదారులు

మానకొండూర్‌: ఎన్‌హెచ్‌– 563.. 68 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి.. కరీంనగర్‌– వరంగల్‌ మధ్య కొన్నేళ్లు నరకం చూసిన వాహనదారుల చిరకాల కోరిక. గుంతల రోడ్లపై రెండున్న గంటల ప్రయాణంతో ఇబ్బంది పడ్డ వాహనదారులు ఇప్పు డు రయ్‌రయ్యంటూ గమ్యం చేరుతున్నారు. ట్రయ ల్‌ రన్‌ నేపథ్యంలో సాఫీ ప్రయాణంతో పాటు సమ యం ఆదా అవుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్‌హెచ్‌–563 పక్కన ఉన్న గ్రామాల ప్రజలు తమ ఊరి నుంచి విశాలమైన రోడ్డు పడిందని మురిసిపోయే లోపే.. ఇవేం హైవే కష్టాలు అంటూ తల పట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం ఇరుకుల్ల వద్ద ప్రారంభమయ్యే కరీంనగర్‌– వరంగల్‌ జాతీయ రహదారి మానకొండూర్‌ మండలం శ్రీనివాస్‌నగర్‌, అన్నారం, మానకొండూర్‌, ముంజంపల్లి, ఈదులగట్టెపల్లి, ఖాదర్‌గూడెం, చెంజర్ల, గట్టుదుద్దెనపల్లి, శంశాబాద్‌, తాడికల్‌, అంబాల్‌పూర్‌, కేశవపట్నం, మొలంగూర్‌, కొత్తగట్టు లింగాపూ ర్‌ గుండా వరంగల్‌ వరకు విస్తరించింది. ఆయా గ్రామాలకు నేషనల్‌ హైవే నుంచి వెళ్లేందుకు అండర్‌పాస్‌ లేకపోగా.. రోడ్డు దాటేందుకు సర్కస్‌ఫీట్లు చేయాల్సి వస్తోంది. ఒక్కో గ్రామంలో ప్రజలు ఒక్కో కరమైన సమస్యతో సతమతమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement