ఆసనంలో అద్భుతం.. ఏకాగ్రతలో అసమానం.. కరీంనగర్‌లో జరిగిన 13వ రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో చిన్నారులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్న వయసులోనే యోగాతో అద్భుతమైన శారీరక సమతుల్యత, ఏకాగ్రతను సాధిస్తూ అబ్బురపరిచారు. శరీరాన్ని విల్లులా వంచుతూ.. కాళ్లను తలపైకి చేర్చుతూ.. చేతులపై శరీరాన్ని నిలబెడుతూ చేసిన యోగా విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. ప్రతి ఆసనం వెనుక నెలల తరబడి సాధన, ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కనిపించాయి. వయసు చిన్నదైనా సాధనలో పెద్దలకే సవాల్ విసిరేలా వారి విన్యాసాలు సాగాయి. – కరీంనగర్ స్పోర్ట్స్


