కరీంనగర్ అర్బన్/తిమ్మాపూర్: జిల్లాలో జరుగుతు న్న భూ భారతి రీసర్వే ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సర్వే కోసం ప్రభుత్వం 70 గ్రామాలను ఎంపిక చేసింద న్నారు. ప్రస్తుతం 16 గ్రామాల్లో కొనసాగుతున్న ప్రక్రియను వేగవంతం చేస్తూ మరో 15 గ్రామాల్లో రీ సర్వే ప్రారంభించాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో రైతులకు అవగా హన కల్పించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కిషన్‌రావు పాల్గొన్నారు.
అర్హులైన ఓటర్ల పేర్లు మిస్ కావొద్దు
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల జాబితా పరిశీలనను జాగ్రత్తగా చేపట్టాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. తహసీల్దార్ కర్ర శ్రీనివాస్‌రెడ్డిని ప్రక్రియ వివరాలు అడి గి తెలుసుకున్నారు. నో మ్యాపింగ్, కరెక్షన్స్‌కు నోటీసులు అందించిన ప్రతి వ్యక్తి నుంచి అవసరమైన డాక్యుమెంట్లు సేకరించాలని సూచించారు. బీఎల్‌వోలు చేపడుతున్న ప్రక్రియను రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఓటర్ల పేర్ల తొలగింపు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అర్హులైన ఓటర్ల పేరు పొరపాటున కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలన్నారు. నోటీసులు అందించిన వారి నుంచి సరైన ధ్రువీకరణ పత్రాలు తీసుకుని, వాటి ఆధారంగా మాత్రమే తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.


