ఇలాగైతే మిల్లులు నడపలేం | - | Sakshi
Sakshi News home page

ఇలాగైతే మిల్లులు నడపలేం

Sep 12 2026 12:00 AM | Updated on Sep 12 2026 12:00 AM

● డిమాండ్లు పరిష్కరించి పరిశ్రమను ఆదుకోండి ● రైస్‌ మిల్లర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శశికిరణ్‌

కరీంనగర్‌ అర్బన్‌: సమస్యలు పరిష్కరించకుండా మిల్లులు ఎలా నడపగలమని రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోనగిరి శశికిరణ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మిల్లింగ్‌ సమస్యలకు పరిష్కా రం చూపేవరకు మిల్లులు తెరవమని స్పష్టం చేశా రు. సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నమనేని సుధాకర్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం రైస్‌ మిల్లర్ల సంఘం భవనం నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. రైస్‌మిల్లర్లు, హమాలీలు, డ్రైవర్లు, ఆపరేటర్లు వేల సంఖ్యలో పాల్గొనగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. శశికిరణ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ చేయూత లేకపోవడం వల్లే రైస్‌ మిల్లులు సంక్షోభంలోకి నెట్టబడ్డాయని ఆరోపించారు. రబీ 2025–26లో వచ్చిన ధాన్యంలో అధిక భాగం బాయిల్డ్‌ రైస్‌కు అనుకూలంగా ఉందని, రారైస్‌ మిల్లింగ్‌ చేస్తే వైట్‌ చాకీ పర్సంటేజీ, నూక శాతం అధికంగా వస్తుందన్నారు. అలాంటప్పుడు నిర్దేశిత నాణ్యత, రికవరీ సాధించడం ఆచరణలో ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మిల్లర్లకు రావాల్సిన మిల్లింగ్‌, డ్రాయేజ్‌, కస్టోడియన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ చార్జీలు సకాలంలో చెల్లించాలన్నారు. బోయినపల్లి ప్రభాకర్‌రావు, గిరిధర్‌లాల్‌ డొడియ, వీరకుమార్‌, మల్లారెడ్డి, గంగారెడ్డి, నర్సింగరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement