ప్రతీ డివిజన్‌కు 300 చొప్పున ఉచితంగా పంపిణీ లాంఛనంగా ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యావరణ పరిరక్షణకు బల్దియా చర్యలు
కరీంనగర్‌కార్పొరేషన్: వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు నగరపాలక సంస్థ నడుం బిగించింది. ఏటా ఇస్తున్నమాదిరిగానే ఈసారీ మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా అందచేస్తోంది. నగరపాలకసంస్థ పరిధిలోని 66 డివిజన్‌లకు గాను ప్రతీ డివిజన్‌కు 300 చొప్పున ప్రతిమలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. గురువారం మేయర్ కొలగాని శ్రీనివాస్ గణపతి ప్రతిమల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు.
మట్టి గణపతి ప్రతిష్ఠించాలి
పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఇంటా మట్టి గణపతిని ప్రతిష్ఠించాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), రసాయన రంగులతో తయారు చేసే విగ్రహాలతో నీటి వనరులు కలుషితమై పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు సర్దార్ రవీందర్ సింగ్, చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, కాంతాల జగన్‌రెడ్డి, తాటి ప్రభావతి, గుగ్గిళ్ల జయశ్రీ, అధికారులు పాల్గొన్నారు.


