ఎస్సారార్‌లో జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

ఎస్సారార్‌లో జాబ్‌మేళా

Sep 11 2026 10:51 AM | Updated on Sep 11 2026 10:51 AM

పట్టా భూములను 22–ఏ నుంచి తొలగించాలి

కరీంనగర్‌సిటీ: కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ కళాశాలలో ఐసీఐసీఐ బ్యాంక్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎన్‌ఐఐటీ ఆధ్వర్యంలో క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ప్రాసెసింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతీశ్‌ మాట్లాడుతూ ఎంపికై న వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్‌ కె.రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా కళాశాలలో జాబ్‌ మేళాలు, క్యాంపస్‌ నియామకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ డ్రైవ్‌కు 50 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌ కోఆర్డినేటర్‌ కె.సుధాకర్‌, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ హర్‌జ్యోత్‌ కౌర్‌, సీనియర్‌ కౌన్సిలర్లు మనోజ్‌ కుమార్‌, రాకేశ్‌ పాల్గొన్నారు.

కరీంనగర్‌: రపైవేట్‌ పట్టా భూములను 22–ఏ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు కొత్తపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐకి వినతిపత్రం సమర్పించారు. జాడి బాల్‌రెడ్డి, కుంట తిరుపతి, హరీశ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గుజ్జ శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ వాసా ల రమేశ్‌ పాల్గొన్నారు. రేకుర్తిలోని సుమారు 125, విద్యానగర్‌లోని 16 సర్వే నంబర్లను 22–ఏ నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు.

ఐలమ్మ వర్ధంతి..

చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని శాతవాహన యూనివర్సిటీ ఎదుట బీజేపీ పశ్చిమ జోన్‌ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. శ్రీనివాస్‌, నరేశ్‌, సంతోష్‌, చంద్రగిరి వేణు, పరశురాములు పాల్గొన్నారు.

ఒకరి అనుమానాస్పద మృతి

కరీంనగర్‌క్రైౖం: నగరంలోని కోతిరాంపూర్‌కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వన్‌టౌన్‌ పోలీసుల వివరాలు.. కోతిరాంపూర్‌కు చెందిన బండ మల్లేశం (45) గతంలో మేసీ్త్రగా పనిచేసే వాడు. ఐదేళ్లుగా మద్యానికి బానిసయ్యడు. బుధవా రం రాత్రి మల్లేశం చాతిలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement