క్షణికావేశంలో అంతులేని విషాదం
జిల్లాలో బలవన్మరణాల కలవరం
నాలుగేళ్లలో 1,066 మంది సూసైడ్
చదువు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులే కారణాలు
మృతుల్లో పురుషులే అధికం
నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
మహిళలు
మొత్తం
పురుషులు
2023
297
239
58
291
231
2024
60
289
53
236
2025
2026
(ఆగస్టు వరకు)
189
148
41
జిల్లాలో 2023 నుంచి 2026 ఆగస్టు వరకు 1,066 ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఇందులో పురుషుల సంఖ్య 854 ఉండటం ఆందోళనకర అంశం. బాధను బయటకు చెప్పుకోకపోవడం, సమస్యలను ఒంటరిగా ఎదుర్కొనే ప్రయత్నం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లు వంటి అంశాలు కొందరిని మరింత మానసిక సంక్షోభంలోకి నెడుతున్నాయి.
విద్యార్థులు పరీక్షలు, మార్కులు, కెరీర్ విషయంలో ఒత్తిడికి గురైతే తల్లిదండ్రులు సపోర్టుగా నిలవాలి. దంపతుల మధ్య సమస్యలు ఉంటే మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడి సాయం కోరాలి. సమస్య ఎంత పెద్దదైనా.. దానికి పరిష్కారం వెతికే అవకాశం ఉంటుంది. కానీ ప్రాణం కోల్పోతే తిరిగి పొందే అవకాశం ఉండదు.
తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి సమస్యలను కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పంచుకోవాలి. ఒక వ్యక్తి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు కనిపించినప్పుడు అది అతని వ్యక్తిగత విషయం అంటూ వదిలేయకుండా దగ్గరుండి మాట్లాడాలి. మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి. మానసిక సమస్యకు చికిత్స తీసుకోవడం బలహీనత కాదు. సమస్య నుంచి బయటపడే బాధ్యతాయుతమైన నిర్ణయం.
– ఎల్.వర్షి, మానసిక వైద్య నిపుణుడు
కరీంనగర్: మానవ జన్మ దేవుడిచ్చిన వరం.. ఆ జీవితాన్ని సంపూర్ణం చేసుకోవడం ఎంతో ముఖ్యం.. కష్టమొచ్చిందనో.. చదువులో ఒత్తిడి పెరిగిందనో.. ఉద్యోగం దొరకడం లేదనో.. ఆర్థికంగా ఇబ్బంది అవుతోందనో.. కుటుంబ పరిస్థితులు.. ఆరోగ్య సమస్యలు.. ఇతర ఏ కారణాలైనా.. క్షణికావేశంలో తీసుకునే ఒక్క నిర్ణయం కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నెట్టేస్తుంది. నమ్ముకున్న వారిని రోడ్డున పడేస్తుంది. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, స్నేహితులు.. ఇలా ఆ వ్యక్తిపై ఆధారపడినవారు దిక్కులేనివారవుతున్నారు. జిల్లాలో నాలుగేళ్లలో వేయిమందికి పైగా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో పురుషులే ఎక్కువగా ఉన్నారు. నేడు ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా కథనం.
ఆత్మహత్య ఆలోచన కలిగిన వ్యక్తుల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. అకస్మాత్తుగా అందరికీ దూరంగా ఉండటం, ఎప్పుడూ బాధగా కనిపించడం, నిద్ర లేదా ఆహారపు అలవాట్లలో మార్పులు, చదువు లేదా పనిపై ఆసక్తి తగ్గడం, తరచూ నిరాశ వ్యక్తం చేయడం, ‘నేను లేకపోతే బాగుంటుంది’ వంటి మాటలు మాట్లాడటం, విలువైన వస్తువులను ఇతరులకు ఇచ్చేయడం వంటి మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి సమయంలో ఏమైందని ప్రశ్నించడంతో పాటు ఓపికగా వినడం ఎంతో ముఖ్యం. అందుకే ఆత్మహత్యను వ్యక్తిగత సమస్యగా కాకుండా కుటుంబం, సమాజం మొత్తం స్పందించాల్సిన ప్రజారోగ్య సమస్యగా చూడాల్సిన అవసరం ఉంది.


