కేంద్రం విధానాలతో దేశంలో సంక్షోభం | - | Sakshi
Sakshi News home page

కేంద్రం విధానాలతో దేశంలో సంక్షోభం

Sep 8 2026 12:41 AM | Updated on Sep 8 2026 12:41 AM

● ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ ● రెండోరోజు కొనసాగిన రాష్ట్ర నాలుగో మహాసభలు

కరీంనగర్‌ టౌన్‌: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో దేశం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడుతోందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ అన్నారు. పద్మనాయక కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలో అమరవీరుడు మాదన నారాయణ స్మారక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మోదీ పాలనలో లక్షకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆరోపించారు. కార్పొరేట్లు, విదేశీ విశ్వవిద్యాలయాలకు భూములు కేటాయిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే విద్యావంతులను ‘అర్బన్‌ నక్సల్స్‌’గా ముద్ర వేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించే చర్య అన్నారు. మహాసభల చీఫ్‌ ప్యాట్రన్‌ చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్పు కోసం ‘బద్లావ్‌ జరూరీ హై’ నినాదంతో సీపీఐ ఇటీవల ఢిల్లీలో భారీ సభ నిర్వహించిందని గుర్తుచేశారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు పంజాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టబోయే భవిష్యత్‌ కార్మిక ఉద్యమాలకు ఈ మహాసభ దిక్సూచిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ సి.శ్రీకుమార్‌, ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి వెంకట సుబ్బయ్య, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌, టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్‌, ఉపేందర్‌, సూర్యం, ఆహ్వాన సంఘం ప్యాట్రన్‌ కలవేన శంకర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు వీఎస్‌.బోస్‌, గౌరవాధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ ఎం.నర్సింహా, ఉపాధ్యక్షుడు కె.ఏసురత్నం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement