అర్జీల పర్వం.. నిరసన గళం | - | Sakshi
Sakshi News home page

అర్జీల పర్వం.. నిరసన గళం

Sep 8 2026 12:41 AM | Updated on Sep 8 2026 12:41 AM

● బల్దియా ఎదుట బీఆర్‌ఎస్‌ ఆందోళన ● ప్రజావాణిలో 66 డివిజన్ల సమస్యలపై ఫిర్యాదు

కరీంనగర్‌ కార్పొరేషన్‌/కరీంనగర్‌టౌన్‌: కాంగ్రెస్‌, బీజేపీ వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ నిరసన చేపట్టింది. సోమవారం నగరపాలకసంస్థ కార్యాలయం ఎదుట బైఠాయించి పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయ ద్వారం ఎదుట నిలిచిన నీళ్లలో కాగితపు పడవలు వేసి నిరసన తెలిపారు. బల్దియా ప్రజావాణిలో 66 డివిజన్లకు సంబంధించిన వివిధ సమస్యలపై అధికారులకు దరఖాస్తులు ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌ మాట్లాడుతూ నగరంలో ప్రజా సమస్యలను రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, నగరపాలకసంస్థలోని బీజేపీ పాలకవర్గం గాలికి వదిలేశాయని విమర్శించారు. నగరంలో వీధి దీపాలు వెలగక ప్రజలు అంధకారంలో ఇబ్బంది పడుతున్నారని, శానిటేషన్‌ వ్యవస్థ పూర్తిగా అటకెక్కిందన్నారు. మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యేల అరెస్ట్‌పై రాస్తారోకో

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ నగరశాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌ ఆధ్వర్యంలో బస్టాండ్‌ ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. హరిశంకర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లను అణచివేయాలని చూస్తే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, రవీందర్‌ సింగ్‌, పొన్నం అనిల్‌, గందె మాధవి, ఐలెందర్‌యాదవ్‌, నారదాసు వసంత్‌రావు, గూడెళ్లి రాజ్‌కుమార్‌, నలువాల రవీందర్‌, కొమ్ము భూమయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement