చెట్టుకు కట్టిన బొమ్మల దహనం | - | Sakshi
Sakshi News home page

చెట్టుకు కట్టిన బొమ్మల దహనం

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం పెద్దకల్వల–పెద్దబొంకూర్‌ మధ్య మెయిన్‌రోడ్డు పక్కనే ఉన్న ఓ చెట్టుకు అపరిచితులు కట్టిన బొమ్మలను గ్రామపంచాయతీ పాలకులు ఆదివారం దహనం చేయించారు. సర్పంచ్‌ కల్వల తిరుపతి సూచన మేరకు వార్డు సభ్యులు వెంగల కనుకయ్య తదితరులు బొమ్మలను కాల్చివేయించారు. బొట్టు పెట్టిన బొమ్మలను చెట్టుకు కట్టుకట్టడాన్ని గమనించిన పలువురు క్షుద్రపూజలు చేశారేమోననే అనుమానాలను వ్యక్తం చేశారు. గ్రామశివారులో ఇలాంటి సంఘటనకు బాధ్యులెవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటన గ్రామస్తులను కొంత కలవరపాటుకు గురిచేసింది. ఇందుకు కారకులెవరనే విషయంపై పంచాయతీ ప్రతినిధులు, పోలీసులు ఆరా తీసి చర్యలు తీసుకోవాలంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement