జానపద కెరటాలు! | - | Sakshi
Sakshi News home page

జానపద కెరటాలు!

Sep 6 2026 2:01 AM | Updated on Sep 6 2026 2:01 AM

మట్టి పరిమళాలు.. జానపద కెరటాలు!

కోట్ల గుండెలను తాకిన పాటమ్మ

బాపు నేర్పిన బాణితో ఎదిగిన పల్లె బిడ్డ చుంచు నాగవ్వ

పల్లె నుంచి వెండితెర దాకా మల్లిక్‌తేజ స్వర ప్రస్థానం

మట్టి పరిమళాల జానపద కెరటం గడ్డం రమేశ్‌

యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌

మట్టి పరిమళాలు..

వారికి పల్లె పాటలంటే ప్రాణం. జానపదాలకు అందమైన అర్థాలు అల్లి.. బాణీకట్టి తమ గొంతుకతో పాడి పాటకే జీవం పోస్తున్నారు. పల్లెటూరు నుంచి సినిమాల్లో పాడేవరకూ ఎదిగిన జానపద స్వరం చుంచు నాగవ్వది. చదువు రాకున్నా.. పాటనే శ్వాసగా మార్చుకుని.. తెలంగాణ మట్టి వాసనను తన గొంతుతో జగమంతా పరిచయం చేస్తున్నారు నాగవ్వ. అమ్మమ్మ, తాతయ్యల ఊరి మట్టి వాసనతో మొదలై.. కోట్లాది వ్యూస్‌, సినిమా స్వరాలతో దూసుకుపోతున్నారు మల్లిక్‌ తేజ. పల్లె యాసలో ఉండే తీయదనం, జానపదంలో పలికే జీవధార ఆయన పాటలకు ప్రాణం పోస్తున్నాయి. పల్లెగుండె చప్పుడును తన గొంతుకగా మార్చుకున్నాడు మరో కళాకారుడు గడ్డం రమేశ్‌. మట్టి వాసనలు.. పల్లె జీవన సౌందర్యం, బతుకమ్మ, బోనాల విశిష్టతను నరనరానా జీర్ణించుకుని జానపదానికి సరికొత్త ఊపిరి పోస్తున్నారు. తండ్రి యక్షగాన వారసత్వాన్ని ఒంటపట్టించుకుని, కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటూ తెలంగాణ జానపద శిఖరంగా ఎదుగుతున్నారు. – గొల్లపల్లి – వివరాలు 8లోu

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement