బీఆర్‌ఎస్‌ సభ అట్టర్‌ఫ్లాప్‌ | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ సభ అట్టర్‌ఫ్లాప్‌

Sep 6 2026 2:01 AM | Updated on Sep 6 2026 2:01 AM

● మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

● మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌: కరీంనగర్‌లో కేటీఆర్‌ నిర్వహించిన ‘యువ సమర భేరీ’ అట్టర్‌ఫ్లాప్‌ అయిందని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌పై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్య లను ఖండించారు. కార్యకర్త నుంచి ప్రజా పోరాటాలతో ఎదిగిన బండి సంజయ్‌ను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు యువత సమస్యలు పట్టించుకోని కేటీఆర్‌కు అధికారం కోల్పోయిన తర్వాతే యువత గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి హామీ అమలు చేయకపోవడం, ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలు, పేపర్‌ లీకేజీలు, 317 జీవో తదితర అంశాలతో యువ త, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. డ్రగ్స్‌ నియంత్రణలోనూ గత ప్రభుత్వం విఫలమైందన్నారు. సిరిసిల్ల అభివృద్ధికి కేటీఆర్‌ తెచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేటర్లు బోయిపల్లి ప్రవీణ్‌రావు, బండ రమణారెడ్డి, చొప్పరి జయశ్రీ, మాసం గణేశ్‌, భూపతి రవీందర్‌, మేకల వెంకటేశ్‌, ఒంటెల సత్యనారాయణరెడ్డి, ఎ.ప్రకాశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement