35 మందికి ఉత్తమ అవార్డులు | - | Sakshi
Sakshi News home page

35 మందికి ఉత్తమ అవార్డులు

Sep 5 2026 5:37 AM | Updated on Sep 5 2026 5:37 AM

శనివారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 ● నేడు కలెక్టరేట్‌లో సత్కారం వినూత్న బోధన విజయ్‌ ప్రత్యేకత

శనివారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): జిల్లాస్థాయిలో 35మంది ఉపాధ్యాయులు 2026–27 విద్యాసంవత్సరానికి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఉదయం 11గంటలకు వీరిని సత్కరించి, పురస్కారాలు అందించనున్నట్లు డీఈవో చైతన్య జైనీ వివరించారు.

ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..

కొత్తపల్లి శారద (జెడ్పీహెచ్‌ఎస్‌, జంగపల్లి), అల్లా పద్మ (టీజీఎంఎస్‌, గంగాధర), జి.వస్మతి (ఎంపీపీఎస్‌, చల్లూర్‌), పి.మంజుల (ఎంపీపీఎస్‌, మన్నెంపల్లి), ఆర్‌.సాయిశిరీష (ఎంపీపీఎస్‌, గన్నేరువరం), పాక అశోక్‌ (జెడ్పీహెచ్‌ఎస్‌, గట్టుదుద్దెనపల్లి), ఉడుత సంపతి (జెడ్పీహెచ్‌ఎస్‌, హుజూరాబాద్‌), సీహెచ్‌.తిరుమల(జెడ్పీహెచ్‌ఎస్‌, మొగిలిపాలెం), పి.సురేంద్ర మోహన్‌ (జెడ్పీహెచ్‌ఎస్‌, నాగులమల్యాల), ఎన్‌.పవన్‌ కుమార్‌ (జెడ్పీహెచ్‌ఎస్‌, ఇందుర్తి), ఎం.సదానందరెడ్డి (జెడ్పీహెచ్‌ఎస్‌, బుజునూర్‌), కె.శ్రీనివాస్‌ (జెడ్పీహెచ్‌ఎస్‌, వెల్ది), కట్కూరి స్వాతి (జెడ్పీహెచ్‌ఎస్‌, సిరిసెడు), టి.అనిత (జెడ్పీహెచ్‌ఎస్‌, ఆరెపల్లి), బి.రాజేశం (జెడ్పీహెచ్‌ఎస్‌, రేణికుంట), వి.ఆంజనేయులు (జెడ్పీహెచ్‌ఎస్‌, జూబ్లీనగర్‌), ఏ.సురేందర్‌ (జెడ్పీహెచ్‌ఎస్‌, పచ్చునూర్‌), ముంతాజ్‌ ఫాతిమా (జెడ్పీహెచ్‌ఎస్‌, ఎల్‌ఎండీకాలనీ), పొన్నం మంజుల (జెడ్పీహెచ్‌ఎస్‌, ఇందుర్తి), బి.కనకయ్య (జెడ్పీహెచ్‌ఎస్‌, ఎలగందల్‌), కె.సౌజన్య (జెడ్పీహెచ్‌ఎస్‌, నగునూర్‌), పి.రాజు (టీజీఎంఎస్‌, సోమారం), కె.రవి (టీజీఎంఎస్‌, గున్ముకుల), టి.భాస్కర్‌ (జీటీఎంఎస్‌, ఎలగందల్‌), ఎన్‌.పూర్ణచందర్‌రావు (ఎంపీపీఎస్‌, నర్సింగాపూర్‌), జి.శాంతి కిరణ్‌ (ఎంపీపీఎస్‌, మంగలపల్లి), ఎస్‌.శ్రీలత(ఎంపీయూపీఎస్‌, గునుకుల కొండాపూర్‌), కె.అంజని ప్రసాద్‌ (పీఎంశ్రీ ఎంపీపీఎస్‌, తనుగుల), పి.ప్రవీణ (ఎంపీపీఎస్‌, నాగంపేట), కె.రాజమ్మ (ఎంపీపీఎస్‌, కొత్తపల్లి), కె.రాము (ఎంపీయూపీఎస్‌, లింగపూర్‌), వి.శ్రీనివాస్‌ (జెడ్పీహెచ్‌ఎస్‌, మానకొండూర్‌), పడాల కిరణ్‌జ్యోతి (కేజీబీవీ, తిమ్మాపూర్‌), అలుగు రజిత(కేజీబీవీ, రామడుగు), కన్నం జయంతి(కేజీబీవీ,కరీంనగర్‌).

కథలాపూర్‌(వేములవాడ): 2026 ఏడాదికి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికై న జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం తాండ్య్రాల ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న గుండు విజయ్‌ 2008లో ఉద్యోగంలో చేరాడు. మండలంలోని సిరికొండ, అంబారి పేట పాఠశాలల్లో పనిచేశాడు. 2018లో తాండ్య్రాలకు బదిలీపై వచ్చారు. అప్పుడు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 90మంది విద్యార్థులు ఉండగా, గతేడాది సంఖ్య 153కు పెరిగింది. ప్రీ ప్రైమరీకి అనుమతి రావడంతో ఈసారి ప్రవేశాలు పెరిగి 176 మంది చదువుతున్నారు. విజయ్‌ ప్రీ ప్రైమరీ తరగతికి పుస్తకాలు రూపకల్పన చేసి, ఎఫ్‌ఎల్‌ఎన్‌లో 90శాతం ఫలితాలు సాధించడంతో అధికారుల మెప్పు పొందాడు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తూ, విద్యార్థులు సెల్‌ఫోన్‌ ద్వారా సమాధానాలు రాసేలా వర్క్‌షీడ్‌ తయారు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement