గుంతలు పాయె.. తారు వచ్చే | - | Sakshi
Sakshi News home page

గుంతలు పాయె.. తారు వచ్చే

Sep 5 2026 5:37 AM | Updated on Sep 5 2026 5:37 AM

● రైల్వే గేట్‌ వద్ద గంటల్లో రోడ్డు నిర్మాణం ● పర్యవేక్షించిన మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

రైల్వే గేట్‌ వద్ద

పూర్తయిన తారు రోడ్డు

కరీంనగర్‌ కార్పొరేషన్‌/కరీంనగర్‌రూరల్‌: ఓవైపు ఆర్‌వోబీ పనుల్లో తీవ్ర జాప్యం.. మరోవైపు గుంతలు.. దుమ్ము, ధూళితో అధ్వానంగా మారిన రోడ్డు.. రైల్వే గేట్‌ పడితే వాహనదారుల నిరీక్షణ.. తీగలగుట్టపల్లి రైల్వే గేట్‌ సమీప ప్రాంతవా సులు, వాహనదారులు నిత్యం పడుతున్న అవస్థలివి. ఇలాంటి కష్టాల్లో వాహనదారులకు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తాత్కాలిక ఉపశమనం కల్పించారు. 2028 వరకు ఆర్‌వోబీ నిర్మాణ గడువుండగా.. రోడ్డయినా వేయాలంటూ ఆర్‌అండ్‌బీశాఖ చుట్టూ తిరిగితే నిధులు లేవంటూ చేతులెత్తేసిన పరిస్థితి. చివరకు నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి రూ.28లక్షలు కేటాయించారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వ రకు తారు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. అర్ధరాత్రి పనులను మేయ ర్‌ శ్రీనివాస్‌ పర్యవేక్షించారు. తారు రోడ్డు రావడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement