సేవా సంకల్ప్‌ అభియాన్‌ను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సేవా సంకల్ప్‌ అభియాన్‌ను విజయవంతం చేయాలి

Sep 5 2026 5:37 AM | Updated on Sep 5 2026 5:37 AM

కరీంనగర్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25ఏళ్ల నిర్విరామ సేవా ప్రయాణాన్ని, వికసిత్‌ భారత్‌–2047 సంకల్పాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ఈనెల 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు చేపట్టిన ‘సేవా సంకల్ప అభియాన్‌’ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని శుభమంగళ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ‘సేవా సంకల్ప అభియాన్‌’ జిల్లా కార్యశాల సన్నాహక సమావేశం జరిగింది. మల్లేశం మాట్లాడుతూ ప్రధాని మోదీ రాజకీయ జీవితాన్ని, అంకితభావాన్ని కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. దేశం కోసం, ప్రజల సంక్షేమం కోసం సేవా సంకల్పంతో నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌ రావు, కన్నబోయిన ఓదెలు, మాడవెంకటరెడ్డి, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, బోయిపల్లి ప్రవీణ్‌ రావు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు స్పందన

కరీంనగర్‌స్పోర్ట్స్‌: జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి జూనియర్‌, సబ్‌ జూనియర్‌ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలకు విశేష స్పందన వచ్చింది. వివిధ ప్రాంతాలనుంచి బాలురు 250, బాలికలు 120 మంది హాజరైనట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు అమిత్‌ రావు, మల్లేశ్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు సంపత్‌రావు తెలిపారు. రాణించిన క్రీడాకారులను ఈనెల 26 నుంచి 29 వరకు వేములవాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. కబడ్డీ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్లాగౌడ్‌, సుధాకర్‌, పద్మ, ఆడెపు శ్రీనివాస్‌, వీరన్న, ప్రశాంత్‌, వర్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement